లగ్జరీ బైక్‌ను కొన్న లహరి

లగ్జరీ బైక్‌ను కొన్న లహరి

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో బోలెడంత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది.

సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఓ లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మొత్తానికి ఈ బైక్‌ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది.

నా బైక్‌ సౌండ్‌ చాలా నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది.దీంతో ఆనీ మాస్టర్‌ సహా పలువురు లహరికి కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్స​ చేస్తున్నారు. ఇక ఈ లగ్జరీ BMW G 310 GS మోడల్‌కి చెందిన ఈ బైక్‌ సుమారు రూ.3-3.5లక్షలు ఉంటుంది.