చాలా సందడిగా ఉన్న బిగ్ బాస్ హౌస్

చాలా సందడిగా ఉన్న బిగ్ బాస్ హౌస్

గత కొంతకాలంగా బోరుగా సాగుతున్న బిగ్ బాస్ షో…సోమవారం ఎపిసోడ్ చాలా సరదాగా గా సాగింది. బిగ్ బాస్ ఫినాలేకు చేరుకోవడంతో ప్రత్యేక అతిధి ని హౌస్ లోకి దింపారు. ప్రముఖ తెలుగు టాప్ యాంకర్ సుమ సోమవారం ఎపిసోడ్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ సందడి చేశారు. ఇంటి సభ్యులతో సరదాగా గడిపి ప్రేక్షకులని బాగా నవ్వించారు. హౌస్ లోకి అడుగుపెట్టడమే అందరిని ఆప్యాయంగా పలకరించిన ఆమె…ఇంటిలో ఇన్స్పెక్షన్ చేసింది. మొదట బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఒక్కొక్కరి బెడ్ దగ్గర ఏమున్నాయని చెక్ చేసింది. ముఖ్యంగా రాహుల్ పునర్నవి పేరుతో చమత్కారం చేశారు.

ఆ తర్వాత కిచెన్ ని పరిశీలించగా… బాబా భాస్కర్ వంటలు బాగా చేస్తారని ఇంటి సభ్యులు ఆమెకు చెప్పారు. తరువాత బాత్ రూమ్ లోకి వెళ్ళి అక్కడే వారితో ముచ్చట్లు పెట్టారు. చిన్నప్పుడు దీపావళి రోజు ఏం చేశారో చెప్పండి ఇంటి సభ్యులని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కిచెన్ దగ్గరకు వెళ్ళగా…ఇంట్లోకి వచ్చిన అతిథి సుమ కోసం బిగ్ బాస్ మటన్ బిర్యానీకి అవసరమయ్యే సామగ్రి అన్నింటినీ పంపించారు. దీంతో శ్రీముఖి బాబా భాస్కర్ కలిసి వంట మొదలుపెట్టారు. ఓవైపు వాళ్లు వంట చేస్తుంటే.. మరోవైపు సుమ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.అందులో భాగంగా ఇంటి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మ్యూజిక్ వచ్చే హెడ్ ఫోన్స్ ధరిస్తే….సుమ వారిని ఒక కార్డు మీద రాసి ఉన్న తెలుగు వాక్యాన్ని అడుగుతుంది. అది వారు అర్ధం చేసుకుని చెప్పాలి.

మొదట శ్రీముఖి వాక్యాన్ని కరెక్ట్ గా చెప్పేయగా…తర్వాత బాబా భాస్కర్ వచ్చి రాని తెలుగుతో ఫుల్ గా నవ్వించాడు. నెక్స్ట్  ‘‘బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు’’ అని సుమ వాక్యం చదివితే.. దానికి వరుణ్ ‘‘పుచ్చకాయ పచ్చిగా ఉంది పుచ్చకాయ పెద్దగా ఉంది’’ అని అందరినీ తెగ నవ్వించాడు. ఆ తర్వాత అలీ రాహుల్ లతో సుమ గేమ్ ఆడింది. మొత్తానికి బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో సుమ వచ్చి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అయితే ఆ టాస్క్ లో గెలిచిన వారికి బిగ్ బాస్ తమ అభిమానులతో మాట్లాడే అవకాశం ఇస్తాను అని చెప్పగా, అందులో అందరిని చాలా వినోదపరచి వరుణ్ సందేశ్ విజయం సాదించాడు.ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో కూడా చాలా వినోదం ఉండబోతుందని తెలుస్తుంది.