సాజిద్‌ ఖాన్‌ ఆగడాల గురించి మరో నటి…!

Bollywood Actor Aahana Kumra Controversy Comments On Sajid Khan

తనూశ్రీ దత్తా మీటూ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత ఎంతో మంది బాలీవుడ్‌ సెలబ్రెటీలు కూడా మేము లైంగిక వేదింపులకు గురయ్యాం అంటూ మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్‌ వ్యవహారం బయటకు వచ్చింది. నానా పటేకర్‌తో మొదలైన ఈ రచ్చ ఎంతో మంది సెబ్రెటీల పరువు తీస్తూనే ఉంది. ఇక బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సాజిద్‌ ఖాన్‌పై పలువురు హీరోయిన్స్‌ మరియు నటీమనులు సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లిని పక్క గదిలో పెట్టుకుని తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, నాతో సెక్స్‌ చేసేందుకు ప్రయత్నించాడు అంటూ ఒక హీరోయిన్‌ ఆరోపించిన విషయం తెల్సిందే. సాజిద్‌ ఖాన్‌ ఎన్నో రకాలుగా హీరోయిన్స్‌ ను వేదించేవాడట. ఈ విషయం పలువురు హీరోయిన్స్‌ బయటకు చెప్పడంతో వివాదం ముదిరింది. ఇప్పటికే ఆయన సినీ కెరీర్‌ నాశనం అయ్యింది.

Bollywood-Actor-Aahana-Kumr

సాజిద్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాలు ఇప్పటికే ఆయన చేజారి పోయాయి. భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్ట్‌లను చేయాలని ఆశలు పెట్టుకున్న సాజిద్‌ ఖాన్‌ ఆశలు అడియాశలు అవ్వడంతో తల పట్టుకున్నాడు. ఈ సమయంలో బాలీవుడ్‌ నటి అయిన అహానా కుమ్రా మరోసారి సాజిద్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసి బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యేలా చేసింది. సాజిద్‌ ఖాన్‌ గురించి తనకు పూర్తిగా తెలుసు. ఆయన హీరోయిన్స్‌ ను లైంగికంగా వేదిస్తాడనే విషయం ఎంతో మంది చెబితే విన్నాను. అయినా కూడా సాజిద్‌ ఒక సినిమా గురించి మాట్లాడాలి రమ్మంటే నో చెప్పలేక పోయాను. దేవుడిని ప్రార్థిస్తూ నన్ను కాపాడమంటూ సాజిద్‌ ఇంటికి వెళ్లాను. ఇంటికి వెళ్లగానే ఒక చీకటి గదిలోకి తీసుకు వెళ్లాలనుకున్నాడు. అయితే నేను బయట మాట్లాడుకుందాం అంటూ ఆయన్ను అడిగాను. కాని ఆయన మాత్రం బయట మా అమ్మ ఉంది, ఆమెకు డిస్ట్రిబ్‌ అని రూంలోకి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆయన చాలా అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, నాతో జుగుప్సకరంగా మాట్లాడాడు. 100 కోట్లు ఇస్తే నువ్వు కుక్కతో సెక్స్‌కు ఓకే చెప్తావా అంటూ జోకులు వేశాడు. నేను ఒక పోలీసు ఆఫీసర్‌ కూతుర్ను అని చెప్పినా కూడా ఆయన చాలా లైట్‌గా స్పందించి అత్యంత అసహ్యంగా ప్రవర్తించాడు అంటూ అహానా కుమ్రా ఆవేదన వ్యక్తం చేసింది.

Sajid-Khan