OG లో పవన్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు…

OG లో పవన్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు...
OG

ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. తాజాగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న ఈయన హరిహర వీరమల్లుతో పాటు వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు. యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టయినర్ OG. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి సినిమా వర్కింగ్ టైటిల్ ఇదే.

కాగా, నేడు మూవీ మేకర్స్ ఒక కీలకమైన అప్ డేట్ ని అందించారు. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్‌ నటుడు ఇమ్రాన్ హష్మి యాక్ట్ చేయబోతున్నాడు అని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. అయితే.. ఇందులో బాలీవుడ్ స్టార్‌ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌ గా నటించబోతున్నారని సమాచారం అందుతోంది.