61 మంది ఆడవాళ్ల్లను ట్రాప్ చేసిన సెల్ ఫోన్ మెకానిక్…వీడియోలలో రాసలీలలు

cellphone mechanic trapped women

అతనో సెల్ ఫోన్ మెకానిక్, అతను అమ్మాయిలను మాయమాటలతో బుట్టలో వేసి వారిని లైంగికంగా వాడుకొని అశ్లీల వీడియోలు తీశాడు. తాను చేసిన రాసలీలన్నీ చిత్రీకరించాడు. ఆ వీడియోలను అతడి దగ్గర నుంచి రహస్యంగా కొట్టేసిన మరో వ్యక్తి ఆ బాదితురాళ్ళను డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. బేరం కుదరకపోవడంతో కొన్ని వీడియోలను వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టాడు. ఇవి కాస్త వైరల్ కావడంతో వీడియోల్లో ఉన్న ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల పరిధిలో జరిగిన ఈ ఘటన అక్కడి వారిని విస్మయానికి గురిచేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో ఓ యువకుడు సెల్‌ఫోన్ రిపెయిర్ షాప్ నడుపుతున్నాడు. అతని షాపు వద్దకు వచ్చే అమ్మాయిలకు ఎరవేయడం మొదలుపెట్టారు. కొంత మంది అమ్మాయిలు అతని బుట్టలో పడిపోయారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 61 మంది అతనితో లైంగికంగా దగ్గరయ్యారు. ఆ అమ్మాయిలతో ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. కానీ, వాటిని అతను బయటపెట్టలేదు. అయితే, సెల్‌ఫోన్‌లో తీసుకున్న వీడియోలను అతను తన షాపులోని కంప్యూటర్‌లో భద్రపరిచాడు. ఆ షాపులో పనిచేసే మరో యువకుడు ఆ వీడియోలను గమనించి తన సెల్‌ఫోన్‌లోని ఎక్కించుకున్నాడు. అంతటితో ఆగకుండా వాటిని గ్రామంలోని మరికొందరు స్నేహితులకు పంపాడు. ఈ విషయం తెలుసుకున్న మరో వ్యక్తి వీడియోలన్నింటినీ సేకరించి, వాటి సాయంతో బాధ్యుడిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. బేరం కుదరకపోవడంతో కొన్ని వీడియోలను పలు వాట్సాప్ గ్రూపుల్లో ఉంచాడు. దీంతో ఈ వీడియోలు చాలా మందికి చేరిపోయాయి. ఇలా వాట్సాప్‌లో వైరల్ అయిన వీడియోలను చూసిన ఓ బాధితురాలు మొగల్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు బాధ్యుడైన యువకుడితో పాటు వీడియోలను చోరీ చేసిన మరో యువకుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.