చంద్రబాబుకి మెగాస్టార్ విషెస్.. మీ అంకితభావం చాలా గొప్పది

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 70వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు నాయుడుకి జన్మిదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మధ్య సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రతీ విషయంపై సందర్భానుసారంగా స్పందిస్తూ.. హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా కూడా మెగాస్టార్ ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం.

కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. విషింగ్ యూ ఏ హ్యాపీ 70th బర్త్ డే సార్.. మీ విజన్, మీ హార్డ్ వర్క్, మీ అంకితభావం ఎంతో గొప్పవి’ ’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు గతంలో చంద్రబాబుతో సరదాగా దిగిన ఒక ఫోటోను కూడా చిరు షేర్ చేయడం విశేషం.