చిరు కూతురు శ్రీజ‌ కు కళ్యాణ్ పంపిన సందేశం…

Chiru Daughter Srija and Kalyan 1st wedding Anniversary

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతోంది. ఇవాళ ఆమె రెండో పెళ్లిరోజు. ఈ సంద‌ర్భంగా శ్రీజ‌కు ఆమె భ‌ర్త క‌ళ్యాణ్ సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు చెప్పాడు. పెళ్లి రిసెప్ష‌న్ లో దిగిన ఫొటోను షేర్ చేసిన క‌ళ్యాణ్ శ్రీజ‌ను ఉద్దేశించి నువ్వే నా బ‌లం, పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు అని పోస్ట్ చేశాడు. ఉత్త‌మ భాగ‌స్వామి, ఎల్ల‌ప్ప‌టికీ నా ప్రపంచం, జ్ఞాప‌కాలు, కుటుంబం, ప్రేమ‌, కుమార్తె, శ్రీజ క‌ళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జ‌త చేసి భార్య‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకున్నాడు. శ్రీజ కూడా త‌న భ‌ర్త‌కు శుభాకాంక్ష‌లు చెప్పింది.

తాను తీసుకున్న ఉత్త‌మ‌మైన నిర్ణ‌యాన్ని ఇవాళ వేడుక‌గా జ‌రుపుకుంటున్నాన‌ని, పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు క‌ళ్యాణ్ అని పోస్ట్ చేసింది. న‌మ్మ‌లేక‌పోతున్నా, సంతోషం, ప్రేమ‌, భార్య‌భ‌ర్త‌లు అనే హ్యాష్ ట్యాగ్ ల‌ను జ‌త‌చేసింది. భ‌ర్త‌తో అనేక సంద‌ర్భాల్లో దిగిన ఫొటోల‌ను కూడా షేర్ చేసింది. క‌ళ్యాణ్ త్వ‌రలోనే హీరోగా వెండితెర‌కు పరిచ‌యం కాబోతున్నాడు. వారాహి ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మాళ‌విక నాయ‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.