వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం

వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం

సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడతారు. రాత్రి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు.

తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని 2వ తేదీ గురువారం ఉ.9.35 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.