తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 256 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే రాష్ట్రం లో ఇంకా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,92,128 కి చేరింది. అయితే కరోనా వైరస్ వాక్సినేషన్ ప్రక్రియ మొదలు కావడం తో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో ఇద్దరు కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాల తో మొత్తం తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 1,581 కి చేరింది. అయితే నిన్న ఒక్క రోజే 298 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,86,542 కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో 4,005 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.