ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నిన్ననే ఊహిన్చని విధంగా చైనా దేశపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను దాటేసిన సంగతి అందరికి తెలిసిందే. అసలు పుట్టిన చోటునే దాటెయ్యడం ఒకెత్తు అయితే ఇపుడు మళ్ళీ ఆ ఒక్క రోజు లోనే ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు అయ్యినట్టు తెలుస్తుంది.

మన దేశంలో కరోనా ఎంటర్ అయ్యి రెండు నెలలు కావస్తున్నా ఇన్ని రోజులు నమోదు కానీ కేసులు గత 24 గంటల్లో నమోదు అయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే 4987 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇదే ఇప్పటి వరకు మన దగ్గర ఒక్క రోజులో నమోదు కాబడిన రికార్డు స్థాయి కేసులని తెలుస్తుంది.

అంతే కాకుండా 2872 మరణాలు సంభవించాయి. దీనితో ఇప్పుడు మన దేశంలో లెక్కలు లక్ష వైపుగా మరో మూడు రోజుల్లో దూసుకుపోవడం ఖాయమని చెప్పాలి ఇప్పటి వరకు 90 వేల 927 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే వేగం కొనసాగితే భారత్ మరింత ప్రమాదకరం అని చెప్పాలి.