Crime: ముగ్గురు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్య

Crime: Suicide of three Basara Triple IT students
Crime: Suicide of three Basara Triple IT students

బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం చెందారు. ఐదు నెలల్లో ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ నవంబర్ 25న, రంగారెడ్డి జిల్లాకు చెందిన శిరీష ఫిబ్రవరి 22న, సోమవారం అరవింద్ సహా ముగ్గురు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నాడు.

దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలం బండారు పల్లి గ్రామానికి చెందిన బుచ్చుక అరవింద్ సెలవులకు ఇంటికి వెళ్లి ఈనెల 12 తిరిగి బాసర ట్రిపుల్ ఐటీకి తిరిగి వచ్చాడు. పీయూసీ పరీక్షలు రాయడానికి హాజరు శాతం తక్కువగా ఉందని పరీక్షకు అనుమతించలేదు.

సోమవారం రాత్రి అరవింద్ తండ్రికి ఫోన్ చేసి జరిమానా చెల్లిస్తే పరీక్షకు అనుమతిస్తారని చెప్పగా రూ. 2000 ఫోన్ పే ద్వారా పంపించారు. మంగళవారం తోటి విద్యార్థులు తరగతులకు వెళ్ళగా అరవింద్ మాత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు నెలల కిందట డెంగీ సోకడంతో చికిత్స చేయించుకోగా హాజరు శాతం తక్కువగా ఉందని అరవింద్ తల్లితండ్రులు చెబుతున్నారు.