హీరోయిన్ డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు

హీరోయిన్ డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు
Dimple Hayathi

గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ డింపుల్ హయతి. రవితేజ సరసన ఖిలాడీ సినిమాలో అమ్మడి అందచందాలకు కుర్రకారు వెర్రెక్కి పోయారు. తాజాగా రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది డింపుల్.

ఈ బ్లాక్ బోల్డ్ బ్యూటీపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఓ ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు, పార్కింగ్‌ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్‌ హీరోయిన్‌తో పాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు పెట్టారు.