సాయి పల్లవిపై ప్రశంసల వర్షం

సాయి పల్లవిపై ప్రశంసల వర్షం

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ హీరోయిన్‌ సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురిపించాడు.ఫిబ్రవరి 27 జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు సుకుమార్‌, సాయి పల్లవి, కీర్తి సురేశ్‌లు ముఖ్య అతిథులుగా హజరైన సంగతి తెలిసిందే. శాంతం కామెడీగా జరిగిన ఈ వెంట్‌లో సుక్కు మాట్లాడుతూ.. కీర్తి సురేశ్‌, రష్మికలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. అనంతరం స్టేజ్‌పై సాయి పల్లవి పేరు ఎత్తగానే శిల్పాకళ వేదిక ఒక్కసారిగా ఫ్యాన్స్‌ అరుపులతో మారుమోగింది. దీంతో సాయి పల్లవి సుకుమార్‌ చెవిలో ఎదో చెప్పింది.

ఆ తర్వాత సుక్కు.. ‘‘ఆమె నా చెవిలో ఏం చెప్పిందో తెలుసా? ‘నా గురించి చెప్పేదేమైనా ఉంటే నాతోనే చెప్పండి’ అంటుంది. తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూస్తుంటే లేడి పవన్‌ కల్యాణ్‌ అనిపిస్తోంది’ అంటూ సాయి పల్లవిని ఆటపట్టించాడు. అలాగే ‘ఇన్నాళ్లకు సాయి పల్లవి గరించి మాట్లాడే అవకాశం వచ్చింది. వ్యక్తిగతంగా తనకు ఒక విషయం చెప్పాలనుకున్నా. కానీ అది ఇప్పుడు కుదరింది. బెసిగ్గా సాయి పల్లవి అంటే ఓ నటి అని అందరికి తెలిసిందే. కానీ ఓ యాడ్‌ రిజెక్ట్‌ చేసిన అర్టిస్ట్‌గా ఆమె ఎప్పటికి గుర్తుండిపోతుంది. అంతటి హ్యుమన్‌ బీయింగ్‌తో(మానవత్వంతో) ఉండటం చాలా కష్టమైన విషయం’’ అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్‌.

కాగా టాలెంటెడ్‌ హీరో శర్వానంద్‌-రష్మిక మందన్నా జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని మార్చి 4న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర బృందం నిన్న శిల్పకళా వేదికలో ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, పాటలు, వీడియోస్‌ మూవీపై ఆసక్తిని పెంచగా.. ఆదివారం విడుదలైన ట్రైలర్‌ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంలో సీనియర్‌ నటీమణులు ఖష్బు సుందర్‌, రాధిక శరత్‌ కుమార్, ఊర్వశీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.