లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి కాకుండా ఎంతమంది హీరో హీరోయిన్స్ ఉన్నారో తెలుసా..?

లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి కాకుండా ఎంతమంది హీరో హీరోయిన్స్ ఉన్నారో తెలుసా..?
Latest News

మంచి దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. మంచి కాఫీలాంటి మూవీ లు తీసి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు ఈ టాలెంటెడ్ దర్శకుడు. మన ఇంట్లో, మన కాలనీలో జరిగే కథతో అనుబంధాల విలువలు చెప్తూ శేకర్ కమ్ముల తెరకెక్కించిన తీరు అద్భుతం అనే మనం చెప్పుకోవ్బలి . ఇక ఈ మూవీ లో చాలా మంది నటులు ఉన్నారు.

లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ మూవీ లో నటించిన ప్రధాన పాత్రలు అభిజిత్, సుధాకర్ వీళ్లిద్దరు పెద్దగాపేరు తెచుకోలేకపోయినా మిగిలినవారు మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందులో కొంతమంది హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ గురించే. లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ చాలా మంది గుర్తుపట్టుండరు. గోల్డ్ ఫేస్ లో ఉండే కుర్రాడిగా నటించాడు విజయ్. అలాగే అదే గోల్డ్ ఫేస్ కుర్రాడిగా విజయ్ ఫ్రెండ్ గా నడిచాడు నవీన్ పోలిశెట్టి గారు . నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపించిన విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్. హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి కాకుండా ఎంతమంది హీరో హీరోయిన్స్ ఉన్నారో తెలుసా..?
Life Is Beautifil

అలాగే ఈ సినిమాలో తెలుగమ్మాయి ఈషరెబ్బ కూడా ఉన్నారు. సరిగ్గా గమనిస్తే ఆమె కూడా కనిపిస్తుంది. ఇక ఎవ్వరు ఊహించనిది ఈ మూవీ లో మరో టాలెంటెడ్ హీరో కూడా ఉన్నారు. అతనే శ్రీ విష్ణు. లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ మూవీ లో హీరో అభిజిత్ ఫ్యామిలీ మెంబర్ లా నటించారు శ్రీ విష్ణు. అలాగే ఈ సినిమాలో గోల్డ్ ఫేస్ అమ్మాయిగా నటించిన యాంకర్ శ్రీముఖిని ప్రేమించి పెళ్లి చేసుకునేది శ్రీవిష్ణునే.. శ్రీ విష్ణు ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా సామజవరగమనా సినిమాతో హిట్ అందుకున్నాడు. చాందిని చౌదరి కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే సీనియర్ నటి అమల, అంజలి జవేరి, శ్రియ ఇలా లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ మూవీ లో చాలా మంది హీరో హీరోయిన్స్ ఉన్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో కనిపించి కనిపించకుండా నటించిన వీరంతా ఇప్పుడు మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు.