ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి కన్నుమూత

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి కన్నుమూత

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి టెడ్‌ డెక్స్‌టర్‌ (86) అనారోగ్యంతో మృతి చెందారు. 1958–1968 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ తరఫున 62 టెస్టులు ఆడిన ఆయన 47.89 సగటుతో 4502 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాదే డెక్స్‌టర్‌కు ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కింది.