యూత్‌ కోసమే ‘యురేక’ టీజర్

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ నిర్మాత గా కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకుడు.. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. టీజర్ ఎంతో ఇంటెన్సివ్ గా ఉంటూ సినిమాపై అంచనాలను పెంచుతుంది.