‘సాహో’లో మరో బాలీవుడ్‌ స్టార్‌

Evelyn Sharma gets Chance in Sahoo movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తున్నారు. సౌత్‌లో కంటే నార్త్‌లో ఎక్కువగా ఈ చిత్రాన్ని బిజినెస్‌ చేసే ఉద్దేశ్యంతో చిత్ర దర్శకుడు ఈ చిత్రం కోసం పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ను దించుతున్నాడు. ఇప్పటికే హీరోయిన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఇంకా బాలీవుడ్‌ స్టార్‌ నటుడు నీల్‌ నితిన్‌ విలన్‌గా నటిస్తుండగా, మందిరా బేడి, టిన్ను ఇంకా పలువురు స్టార్స్‌ నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో మరో బాలీవుడ్‌ స్టార్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఎవెలిన్‌ శర్మను ఎంపిక చేయడం జరిగింది. యాక్షన్‌ సీన్స్‌ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక పాత్ర కోసం ఎవెలిన్‌ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాహోలో ఎవెలిన్‌ పాత్ర చాలా బాగుంటుందని ముఖ్యంగా ఆమె చేసే పోరాట సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. సాహోలో మొత్తానికి మరో బాలీవుడ్‌ స్టార్‌ కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంను ఇదే సంవత్సరంలో చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది.