ఈడెన్ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఆటగాళ్ల బ్యాట్లు, కిట్లు.

Fire accident in Eden Gardens.. Players' bats, kits burnt to ashes
Fire accident in Eden Gardens.. Players' bats, kits burnt to ashes

వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ జరుగనున్న తరుణంలో బీసీసీఐకి ఊహించని షాక్‌ తగిలింది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ లోని ఫాల్స్ సీలింగ్ లో మంటలు చెలిరేగాయి. ఈ ఘటనలో డ్రెస్సింగ్ రూమ్ లోని అనేక పరికరాలు బూడిదయ్యాయి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు వరల్డ్ కప్ లో 5 మ్యాచ్ లకు అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.అగ్ని ప్రమాదం జరుగడంపై, వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ జరుగనున్న తరుణంలో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.