వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ప్రమాదం

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ప్రమాదం

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున ద్రవరూప స్టీల్ నేల పాలయ్యింది.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్టీలు ప్లాంట్‌ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. నష్టం తీవ్రత అంచనా వేయాల్సి ఉంది. అలాగే ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.