త‌ల్లి ప్ర‌మోష‌న్ అందుకున్న అర్జున్ ప్రేయ‌సి

gabriella become mother

బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ 24 ఏళ్ళ వ‌య‌స్సులో మెహ‌ర్ జెస్సియాని వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. వీరి బంధానికి సాక్షిగా మహిక(17), మైరా(13) అనే ఇద్ద‌రు కూతుళ్ళు ఉన్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న గ‌త ఏడాది అర్జున్ రాంపాల్‌, మెహ‌ర్ విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుండి సౌతాఫ్రికాకి చెందిన గాబ్రియేలాతో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

అర్జున్ రాంపాల్ ఆ మ‌ధ్య త‌న ప్రేయ‌సి గాబ్రియేలాకి పండంటి బిడ్డ పుట్ట‌బోతుంద‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. నిండు గర్భిణిగా ఉన్న గాబ్రియేల్లాను గుండెలకు హత్తుకుని దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ విష‌యాన్ని తెలిపాడు. పెళ్లి కాకుండానే గాబ్రియేల్లా ఓ బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌డం గ‌మ‌న‌ర్హం. 2009లో మిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాలీవుడ్‌లో పాల్గొన్న స‌మ‌యంలో అర్జున్ రాంపాల్‌తో గాబ్రియెల్లాకి ప‌రిచ‌యం ఏర్పడింది.ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో అప్ప‌టి నుండి వారిరివురు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. నాగార్జున ‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది గాబ్రియేలా.