అంబానీ ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు.. తరలివచ్చిన సినీ, క్రీడా తారలు

అంబానీ ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు.. తరలివచ్చిన సినీ, క్రీడా తారలు
Latest News

దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబురాలు మొదలయ్యాయి. వీధికి ఒక గణేష్ మండపం.. మండపం వద్ద భక్తుల కోలాహలంతో వీధులన్నీ బాగా సందడిగా మారాయి. మరోవైపు ప్రముఖులు కూడా తమ ఇళ్లలో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా వేడుకలు జరుపుతున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు నిర్వహించారు.

అంబానీ ఇంట గణేశ్ చతుర్థి వేడుకలు.. తరలివచ్చిన సినీ, క్రీడా తారలు
Ambani

ముంబయిలోని ముకేశ్ నివాసం అంటాలియాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా సందడి వాతావరణం నెలకొన్నది . సెప్టెంబర్ 19 రాత్రి ముంబయిలోని తన ఇంట్లో గణేశ్​ చతుర్థి వేడుకలను అంబానీ గ్రాండ్​గా నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు చాలా మంది భారీగా తరలివచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కుటుంబ సమేతంగా విచ్చేసి సందడి కూడా చేశారు.

మరోవైపు బాలీవుడ్ బాద్ షా షారుక్​ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్​, రణ్​వీర్ సింగ్​, దీపికా పదుకొణె, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ, ఆయుషాన్ ఖురానా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్​, అతియా శెట్టి, రష్మిక, అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశాల్​, దర్శకుడు అట్లీ, నయనతార విఘ్నేష్ తమ ఫ్యామిలీతో సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.