దారుణం : ప్రియుడి ముందే ప్రియురాలి గ్యాంగ్ రేప్

girl allegedly gang-raped in front of boyfriend at Goa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అత్యాచారాలని అరికట్టడానికి భారత ప్రభుత్వం ఎన్ని కటిన చట్టాలు చేస్తున్నా మృగాల ముసుగులో ఉన్న కామాందులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో చిన్నపిల్లల మీద అకృత్యాలు పెరగగా తాజాగా గోవాలోని కోల్వా బీచ్ లో నిన్న 20 ఏళ్ల యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపారు. 22 ఏళ్ల ఆమె ప్రియుడి ముందే ఈ దారుణానికి తెగబడ్డారని తెలుస్తోంది. ఈ రేప్ కు సంబంధించి ఈరోజు ఇద్దరిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం

గోవా రాజధాని పనాజికి 50కి.మీ దూరంలో ఉన్న సెన్నాభతిమ్ బీచ్ లో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.ఇండోర్ కు చెందిన ధనంజయ్ పాల్ (23), రామ్ సంతోష్ భారియా (19)లతో పాటు మరో వ్యక్తి గోవా సందర్శించేందుకు వచ్చారు. అయితే అత్యాచారానికి గురైన యువతి దగ్గర్లోనే ఉన్న గ్రామం నుంచి తన ప్రియుడితో కలిసి వచ్చింది. తన మీద అత్యాచారం చేసి అత్యాచారాన్ని కెమెరాతో షూట్ చేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది . పోలీసులకు ఫిర్యాదు చేయరాదంటూ తనను బ్లాక్ మెయిల్ చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో కామాంధులపై సెక్షన్ 376 (రేప్), సెక్షన్ 394 (దొంగతనం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.