290.53కోట్ల లాటరీ టికెట్‌ మర్చిపోయిన యువతి

290.53కోట్ల లాటరీ టికెట్‌ మర్చిపోయిన యువతి

లాటరీ టికెట్‌ కొంటే లక్కీ డ్రా తేదీ కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తుంటారు చాలామంది. అలాంటిది ఒకావిడ తాను లాటరీ టికెట్‌ కొన్న సంగతే మర్చిపోయింది. కొన్న టికెట్‌ తన పర్సులోనే ఉన్నా దానిని వారాల పాటు ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎలాగోలా లాటరీ ఫలితాల విషయం తెల్సి తన టికెట్‌ నంబర్‌ను చెక్‌ చేసుకుంది.

తను కొన్న టికెట్‌కే 39 మిలియన్‌ డాలర్లబంపర్‌ డ్రా తగిలిందనే విషయం తెలిసి సంభ్రమాశ్చర్యానికి గురైంది.ఈ ఘటన జర్మనీలో ఇటీవలే జరిగింది. జూన్‌ తొమ్మిదిన లాటరీ ఫలితాలు ప్రకటించారు. 1.20 యూరోలు  పెట్టి టికెట్‌ను కొని ఇన్నాళ్లూ ఆ సంగతే మర్చిపోయిన ఆమె.. ఇటీవలే తన లాటరీ టికెట్‌లోని ఏడు నంబర్లను సరిచూసుకుని ఆనందసాగరంలో మునిగిపోయారు.