ప్రభాస్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

ప్రభాస్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !
Cinema News

ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పుట్టినరోజు . ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు ఒక శుభవార్త అని చెప్పాలి. ఈ మధ్యనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ విడుదలై థియేటర్ లలో మిశ్రమ స్పందనను దక్కించుకుని ఫ్యాన్స్ కు చాలా నిరాశని కలిగించింది. ఇందులో ప్రభాస్ రాముడిగా , కృతి సనన్ సీతగా నటించారు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించిన ఫలితం లేకుండా నే పోయింది. కాగా ఈ సినిమాను అక్టోబర్ 29వ తేదీన బుల్లితెరపై విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఆదిపురుష్ వచ్చే వారం స్టార్ మా టీవీ లో సాయంత్రం 5 .30 గంటలకు ప్రసారం కానున్నది .

ప్రభాస్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !
Prabhas

ఇక ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో సలార్, కల్కి, స్పిరిట్ లాంటివి ఉన్నాయి, కాగా సలార్ ను చిత్ర బృందం డిసెంబర్ లో విడుదల చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.