గుడ్ న్యూస్ : శ్రీముఖి పాన్ ఇండియా సినిమాతో గ్లోబల్ ఎంట్రీ!

Good News : Srimukhi: Global Entry with Pan India Movie!
Good News : Srimukhi: Global Entry with Pan India Movie!

బుల్లితెర రాములమ్మగా.. యాంకర్‌ శ్రీముఖి పేరు సంపాదించిన విషయం అందరికి ]తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో లీడ్ యాంకర్ గా ఏ ఛానల్ పెట్టినా ఈ అమ్మడు కన్పిస్తూనే ఉంటుంది. ఒక వైపు షోస్ చేస్తూ మరోవైపు లేటెస్ట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియాలోనూ యాక్టీవ్గా ఉంటూ ఫ్యాన్స్కు రెగ్యులర్గా టచ్లో ఉంటుంది. ఇంకోవైపు కెరీర్లో కొన్ని మూవీ ల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కనిపించి ప్రేక్షకులను అలరించింది.

Good News : Srimukhi: Global Entry with Pan India Movie!
Good News : Srimukhi: Global Entry with Pan India Movie!

గతంలో ఆమె జులాయి, నేను శైలజా మూవీ ల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే శ్రీముఖి ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా మూవీ లో ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది . అల్లు అర్జున్- అట్లీ కాంబోలో పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న మూవీ లో శ్రీముఖి నటించనుందట. ఈ మూవీ లో కూడా బన్నీకి సిస్టర్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇదివరకే వీరిద్దరూ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన జులాయిలో నటించి ఆకట్టుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ మరోసారి వీరిద్దరినీ బిగ్ స్క్రీన్పై పై చూసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. శ్రీముఖి చివరగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ లో కనిపించింది.