హనుమాన్ విజృంభణ : నెలలోనే 300 కోట్ల వసూళ్లు..!

హనుమాన్ విజృంభణ : నెలలోనే 300 కోట్ల వసూళ్లు..!
Cinema News

టాలీవుడ్ యంగ్ టాలెంట్ తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన సినిమా హనుమాన్‌’. విడుదలకు ముందు నుంచే సూపర్ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ తర్వాత సూపర్ హిట్ టాక్ను సంపాదించుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన హనుమాన్ తాజాగా మరో సరికొత్త మైలురాయిని చేరుకుంది.

విడుదలైన 25 రోజుల్లో రూ.300కోట్లు వసూళ్లు చేసి మరో సెన్సేషనల్ రికార్డు ని క్రియేట్ చేసింది హనుమాన్. ఈ ఏడాదిలో రూ.300 కోట్లు సాధించిన మొదటి మూవీ గా రికార్డును నెలకొల్పింది. దీనిపై దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘హనుమాన్‌’ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ మూవీ కి ఎంతోమంది వారి హృదయాల్లో స్థానం కల్పించారు. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు దీన్ని వీక్షిస్తున్నారు. ఈ మూవీ ని ఆదరిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు’ అని ప్రశాంత్ వర్మ పోస్టులో పేర్కొన్నారు.

https://twitter.com/PrasanthVarma/status/1754740414882763242/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1754740414882763242%7Ctwgr%5E973e9f7c399298242e0fb4dbf66f434f5b796a09%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fcinema%2Fhanuman-movie-in-300-crore-club.html