‘హరి హర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో..హ పండగ రోజే..?

‘హరి హర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో..హ పండగ రోజే..?‘హరి హర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో..హ పండగ రోజే..?
Cinema News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హృద్యమైన మూవీ ల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో బాబీ డియోల్, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ నటిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతున్నట్లు నిన్న మేకర్స్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

‘హరి హర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో..హ పండగ రోజే..?
Hari Hara Veera Malla

అలానే త్వరలో ఈ సినిమా లో నుండి ఒక స్పెషల్ ప్రోమోని కూడా రిలీజ్ చేయనున్నట్లు వారు తమ ప్రకటనలో చెప్పారు. విషయం ఏమిటంటే, ఈ స్పెషల్ ప్రోమో మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. భారీ లెవెల్లో హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న హరి హర వీరమల్లు యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ ను ఆ ప్రోమోలో అనౌన్స్ చేయనున్నారట. అయితే దీని పై మేకర్స్ నుండి క్లారిటీ మాత్రం రావాల్సి ఉన్నది . మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.