గ్రామ వాలంటీర్ పై మరో వాలంటీర్ లైంగిక వేధింపులు…

Odisha Girl Gangraped Over 28 Days

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ గ్రామంలో ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ బాంధవి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం తువ్ర కలకలం రేపుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన మరో వాలంటీర్ శ్రీనివాస్ తో ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అదేవిధంగా ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు వాలంటీర్ శ్రీనివాస్ వేధింపులే కారణమని మృతిచెందన ఆ అమ్మాయి  తండ్రి ఆరోపణలు చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయం తెలియడంతో వాలంటీర్ శ్రీనివాస్ కు గ్రామస్తుల దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ వాలెంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ.. కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు ఆ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ.. ఆ గ్రామ వాలెంటీర్ సూసైట్ మాత్రం అంతటా కలకలం రేపుతోంది.