భవిష్యత్తు గురించి క్లారిటీ తెచ్చుకున్న హీరో నిఖిల్

భవిష్యత్తు గురించి క్లారిటీ తెచ్చుకున్న హీరో నిఖిల్

యువ క‌థానాయ‌కుడు నిఖిల్ చాన్నాళ్లుగా మోస్తున్న భారం ఈ శుక్ర‌వారంతో తీరిపోయింది. అత‌డి కొత్త సినిమా అర్జున్ సుర‌వ‌రం ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌మిళ హిట్ మూవీ గ‌ణిద‌న్‌కు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రం విడుద‌ల ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ ఫ‌లితం మీద నిఖిల్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు.

ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతున్న త‌రుణంలోనే నిఖిల్ కొత్త ప్రాజెక్టుల మీద కూడా సందిగ్ధ‌త నెల‌కొంది. శ్వాస పేరుతో మొద‌లుపెట్టిన ఓ సినిమా మ‌ధ్య‌లో ఆగిపోయింది. కార్తికేయ‌-2కు కూడా అడ్డంకులు వ‌చ్చాయి.

ఐతే అర్జున్ సుర‌వ‌రం సినిమా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్న నిఖిల్ త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల మీద కూడా ఒక క్లారిటీ తెచ్చుకున్నాడు. శ్వాస సినిమాను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి కార్తికేయ‌-2కు త‌లెత్తిన ఇబ్బందులు కూడా స‌మ‌సిపోయేలా చేశాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కాగా అర్జున్ సుర‌వ‌రం హ‌డావుడి ముగిశాక పూర్తి స్థాయిలో ఈ సినిమాకు డేట్లు కేటాయించి సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేయాల‌నుకుంటున్నాడు.