‘ఇస్మార్ట్ శంకర్’తో సినిమా చేయనున్న సురేందర్ రెడ్డి

'ఇస్మార్ట్ శంకర్'తో సినిమా చేయనున్న సురేందర్ రెడ్డి

ఇప్పుడు లేటెస్టుగా సురేందర్ రెడ్డి టాలీవుడ్ యంగ్ హీరోతో మూవీ చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అతనెవరో కాదు ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ ఫార్మ్ లో ఉన్న రామ్ పోతినేని.’ఇస్మార్ట్ శంకర్’ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ ‘రెడ్’ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మించగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఏప్రిల్ లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా ‘రెడ్’ సినిమా తర్వాత రామ్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు.

అయితే ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ రామ్ కి నచ్చిందట. ‘రెడ్’ సినిమా రిలీజ్ అయిన వెంటనే సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ చేయాలని రామ్ పోతినేని భావిస్తున్నాడట. హీరోలను స్టైలిష్ గా ప్రజంట్ చేయడంలో సూరిని మించిన వారు లేరని ఇండస్ట్రీలో అంటుంటారు. ముందే స్టైలిష్ గా ఉండే రామ్ ని ఇంకెంత స్టైలిష్ గా చూపిస్తాడో అని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.