పెళిళ్లు నాకు సెట్‌ కావు

పెళిళ్లు నాకు సెట్‌ కావు

బిగ్‌బాస్‌ బ్యూటీ హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్‌ వస్తున్నాయి. అసలు హిమజకు పెళ్లయిందనే విషయంపైనే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులేంటన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. తాజాగా తన విడాకులపై సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందించింది.

‘ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి నేను పట్టించుకోను. కానీ మా పేరెంట్స్‌ కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతుల వల్ల వాళ్లు ఎక్కువ బాధపడతారు. దయచేసి ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు ప్రచారం చేయకండి. అలాగే నా పెళ్లి, విడాకులకు నన్ను కూడా పిలవండి’ అంటూ వ్యంగంగా స్పందించింది. 3-4ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని, ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికి చెప్పి చేసుకుంటానని తెలిపింది.

‘పెళిళ్లు నాకు సెట్‌ కావు ప్రస్తుతం సింగిల్‌గా హ్యాపీగా ఉంటూ మా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నా. సింగిల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా నా వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో కొందరు కుట్ర పన్ని ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు క్రియేట్‌ చేస్తున్నారు’ అంటూ తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్‌ పెట్టేసింది.