160 అడుగుల క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్

160 అడుగుల

సిటీలో మొట్ట మొదటి ఫ్లై డైనింగ్ రెస్టారెంట్ ఆరంభం కానుంది. క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్ ఆకాశంలో ఫుడ్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించడానికి లాంచ్ కానుంది. హైటెక్ సిటీలో క్లౌడ్ డైనింగ్ రెస్టారెంట్ కి సంబంధించిన ప్రీ లాంచింగ్ కార్యక్రమం గ్రాండ్ గా జరిపారు.

ఫుడ్ లవర్స్ కి 160 ఫీట్ల ఎత్తులో డైనింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించడానికి వస్తున్న మొట్ట మొదటి రెస్టారెంట్ ఇదే కానుంది. హైదరాబాద్ లోని ఫుడ్ లవర్స్ కి ఇలాంటి అనుభవాన్ని కల్పించబోతున్నాం ఆనందంగా ఉంది అని నిర్వాహకులు చెప్తున్నారు.లంచ్ అండ్ డిన్నర్ బఫెను అందించబోతున్నట్టు చెప్పారు. 50 రకాల స్పెషల్ వంటకాలతో ఉందనున్నట్లు సమాచారం డైనింగ్ టేబుల్ ను సీట్ బెల్ట్ సహాయంతో అరేంజ్ చేశామని ఒకసారి 26 మంది ఈ అవకాశాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ తరహా రెస్టారెంట్ ఇండియాలోనే మొదటి సారిగా లాంచ్ చేస్తున్నామని నిర్వాహకులు తెలియ చేశారు.