ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌ ఫలితాలు విడుదల

మరో వారంలో ఇంటర్‌ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. జులై మధ్యలో ఫస్ట్‌ ఇయర్ క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.