మాస్ మహారాజ నెక్స్ట్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

మాస్ మహారాజ నెక్స్ట్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
Cinema News

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ వరుస సినిమా లి చేస్తూ కెరీర్ లో బిజీగా దూసుకు పోతున్నారు. టైగర్ నాగేశ్వర రావు సినిమా తో దసరా పండుగ కి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తన తదుపరి సినిమా కి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ ఉంది. తనకు సూపర్ హిట్ సినిమా లను అందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మరొక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కి సంబందించిన వరుస అప్డేట్స్ నేడు రానున్నాయి. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించేసారు .

మాస్ మహారాజ నెక్స్ట్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
Ravi Teja

ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.