ముక్కాబులా పాటకు స్టెప్పులేసిన జడ్డూ..

Cricketer Ravindra Jadeja
Ravindra Jadeja

ఆల్ రౌండర్ జడ్డు అదేనండి మన రవీంద్ర జడేజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండియన్ టీంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పాత్ర చాలా కీలకం. టి20 ప్రపంచ కప్ లో అతడు ఆడటం ఎంతో అవసరమని తన ఆల్ రౌండర్ సేవలను కూడా జట్టు బాగా వినియోగించుకుంటోంది. అయితే.. క్రికెట్ ప్లేయర్ రవీంద్ర జడేజా మైదానంలోనే కాదు బయట కూడా ఆల్రౌండ్ ప్రదర్శన చేయగలనని నిరూపిస్తున్నారు.
అమెరికా పర్యటనకు వెళ్లిన జడేజా, ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ పార్టీలో పాల్గొని ‘ముక్కాలా ముక్కాబులా లైలా’ పాటకు చిందులు వేసిన వీడియోను CSK తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. కాగా, ఇటీవల జరిగిన IPL 2023 లో అరుదైన క్లబ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 1000కి పైగా పరుగులు చేసి, 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలోకి చేరారు టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.