జగన్ తో అలేఖ్య ఫోటో రచ్చ ఆగలేదు…సీన్ లోకి abn .

Jagan Alekhya Selfies

వై.ఎస్ జగన్ తో అలేఖ్య ఏంజెల్ ఫోటో వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. పవన్ కళ్యాణ్ వివాహాల గురించి జగన్ చేసిన ప్రకటన తో వైసీపీ,జనసేన మధ్య మొదలైన రచ్చలో అనూహ్యంగా ఒకప్పుడు అలేఖ్య ఏంజెల్ అనే నటి ఫోటో వచ్చి చేరింది. జగన్ తో అలేఖ్య ఏంజెల్ ఒకప్పుడు దిగిన ఫోటోని సోషల్ మీడియాలో వచ్చింది. ఆ ఫోటో లో వున్న జగన్ ని టార్గెట్ చేసిన పవన్ ఫాన్స్ ఇంకో వైపు అలేఖ్య ఏంజెల్ వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచారు. అయితే ఓ సినిమా సీడీ విడుదల సందర్భంగా జగన్ తో ఆమె ఫోటో దిగినప్పుడు పక్కనే ఆమె కుటుంబ సభ్యులు కూడా వున్నారు. అయితే అవేమీ పట్టించుకోకుండా తమ అభిమాన నటుడిని తిట్టిన జగన్ ని కౌంటర్ చేయడమే లక్ష్యంగా పవన్ ఫాన్స్ రెచ్చిపోయారు. ఆ ఇద్దరి మధ్య నలిగిపోయింది మాత్రం పాపం ఏ పాపం ఎరుగని అమాయకురాలు అలేఖ్య ఏంజెల్. ఆమె మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించినా పవన్ అభిమానులకి ఎక్కడం లేదు. ఆమెని ఇంకా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే వున్నారు.

పవన్ సూచనల్ని కూడా ఆయన అభిమానులు లెక్క చేయకుండా ఇలా చెప్పుకోలేని భాషలో కామెంట్స్ చేయడంతో అలేఖ్య abn ఛానల్ ద్వారా జనం ముందుకు వచ్చారు.తన ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయంలో ఆమెకు మద్దతుగా చాలా మంది మాట్లాడారు. అలేఖ్య ఏంజెల్ మాటలతో పవన్ ఫాన్స్ డిఫెన్స్ లో పడ్డారు. Abn ఆమెని స్టూడియోకి పిలవడం మీద గరం గరం అవుతున్నారు. Abn రాధాకృష్ణ కావాలనే పవన్ ప్రతిష్ట దెబ్బ తీస్తున్నారని మెగా అభిమానుల సందేహం. పైగా జగన్ అంటే మండిపడే రాధాకృష్ణ ఇప్పుడు ఆయనకు కూడా అనుకూలంగా ఉండేలా పవన్ మీద కావాలనే అలేఖ్య తో మాటల దాడి చేయిస్తున్నారని అంటున్నారు. ఈ మాటలు ఎలా ఉన్నప్పటికీ అలేఖ్య ఎపిసోడ్ తో పవన్ ఇమేజ్ కి డామేజ్ జరిగేలా వుంది.