జగన్ నోరు జారాడు…పవన్ ఫ్యాన్స్ అంతకు మించి…ఛీ ఛీ !

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విలువల గురించి పవన్ మాట్లాడుతున్నారని, అసలు ఆయనకు విలువలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం విలువలా అని ప్రశ్నించారు. నాలుగేళ్లకు, ఐదేళ్లకు ఒకసారి కొత్త కార్లు మార్చినట్లుగా పెళ్లాలను మారుస్తున్నారని, వేరేవారయియితే, నిత్య పెళ్లి కొడుకు అని జైల్లో వేసే వారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడినా మనం వినవలసిరావడం, వాటి గురించి మళ్లీ విశ్లేషించుకోవడం మన ఖర్మ అని పేర్కొని ఒక్క సారిగా కలకలం రేపారు.

రాజకీయాలల్లో ఉన్నా.. సినిమా సినిమాల్లో ఉన్నా అది ప్రజాసంబంధ విషయం కానంత వరకు వారి వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేసే అధికారం ఎవరికీ లేదు. ఎవరి వ్యక్తిగత జీవితంపైనైనా బహిరంగంగా కామెంట్ చేశారంటే అది ఇంకేమీ చేయలేని పరిస్థితుల్లో అయినా అయ్యుండాలి, లేదా విషం కక్కే ప్రయత్నం అయినా అయ్యుండాలి. సరే జగన్ విషం కక్కే ప్రయత్నమే చేసాడనుకుంటే దానిని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ పవన్ ఫ్యాన్స్ చేస్తోందేంటి ? సరే జగన్ కి విలువలు లేవనుకుందాం కాసేపు బహుశా పవన్‌కి, ఆయన అభిమానులకు తెలియదేమో గానీ సినిమాలలో దేవుడిగా కొలిచి ‘అందరివాడు’ అనిపించుకున్న నాటి ఎన్టీఆర్‌కే వ్యతిరేకంగా సూపర్‌స్టార్‌ కృష్ణ ధ్వజమెత్తాడు.

ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా కూడా ఎన్టీఆర్‌ని లెక్కచేయకుండా ఆయనపై ‘మండలాధీశుదు, గండి పేట రహస్యం’ వంటి వ్యంగ్యాస్త్రాలను సంధించాడు. ఇక ఎన్టీఆర్‌ అంటే ప్రాణం ఇచ్చే కైకాల సత్యనారాయణ వంటి వారు కూడా ఎన్టీఆర్‌ తరహా వేషధారణతో ‘సాహసమే నా ఊపిరి’ వంటి చిత్రాలలో వ్యంగ్యంగా మా దగ్గరేముంది బూడిద అంటూ కాషాయ వస్త్రాలలో కనిపించి, నటించారు. చివరకు ఇది కృష్ణ ఓ రాజకీయ సభలో ప్రసగించేటప్పుడు ఆయనపై రాళ్లు వేసి ఆయన ఒక కన్ను సరిగా కనిపించడానికి లేని విధంగా ప్రమాదం జరిగింది. ఇక చిరంజీవి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది ? ఇక ఇప్పుడు పవన్‌ వంతు వచ్చింది. పవన్‌ వ్యక్తిగతం, ఉదయ్‌కిరణ్‌ నిశ్చితార్థంలో ఆయన మీడియాపై చేయిచేసుకున్న సంగతి.

ఆయన సొంత వ్యవహారం అయిన మూడు పెళ్లిళ్ల సంగతి ఎవ్వరూ పట్టించుకోకుండా నాకు కులం లేదు మతం లేదు పవర్‌ పాలిటిక్స్‌ వద్దు అని చెప్పిన పవన్‌ భావాలకు తటస్థ వ్యక్తులు కూడా హర్షించారు. కానీ నేడు పవన్‌ తన ఫ్యాన్స్‌ చేస్తున్న రచ్చ చూస్తూ మౌనంగా ఉండటం, చూస్తుంటే. దానిపై పవన్‌ కనీసం మాట్లాడలేని స్థితిని గమనిస్తే బహుశా పవన్‌ చెప్పే ఆశయాలు, ఆయన మేనిఫెస్టో, ఆయన మాట్లాడే పవనిజం అంటే ఇలా వ్యక్తిగత దాడులు ఏనా అని సందేహం వస్తోంది.

జగన్ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు జనసైనికులు, శతగ్ని టీం ఇప్పుడు రివర్స్ తిట్లు మొదలు పెట్టారు. నిత్యబెంగుళూరు రసికుడు అని. విభజన వాగ్దానాలు, ప్రత్యేకహోదా, రాష్ట్రం అభివృద్ధి అన్నీ కొట్టుకు పోయాయి. నువ్వు వెధవ అంటే చ్చస్ నువ్వు వెధవన్నర వెధవ అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. సాటి రాజకీయ నాయకుడి జీవిత భాగస్వాముల్ని(మాజీ అయినా) నీచంగా సంబోధించే జగన్, అందుకు ప్రతీకారంగా జగన్ చెల్లెలి వ్యక్తిగత జీవితాన్ని ఫ్యాన్స్ పేరుతో రోడ్డు మీదకి గుంజే పవన్. వీళ్ళిద్దరిలో ఎవరు సిఎం అయినా ఆడపిల్లలకి భద్రత, గౌరవం, మర్యాద ఉంటాయా ?

పవన్ ఫ్యాన్స్ చేస్తున్న ప్రచారాన్ని పూర్తిగా రాయలేక అందుకు సంబందించిన స్క్రీన్ షాట్ లను మీ ముందు ఉంచుతున్నాం.

జగన్ నోరు జారాడు...పవన్ ఫ్యాన్స్ అంతకు మించి...ఛీ ఛీ ! - Telugu Bullet జగన్ నోరు జారాడు...పవన్ ఫ్యాన్స్ అంతకు మించి...ఛీ ఛీ ! - Telugu Bullet జగన్ నోరు జారాడు...పవన్ ఫ్యాన్స్ అంతకు మించి...ఛీ ఛీ ! - Telugu Bullet జగన్ నోరు జారాడు...పవన్ ఫ్యాన్స్ అంతకు మించి...ఛీ ఛీ ! - Telugu Bullet జగన్ నోరు జారాడు...పవన్ ఫ్యాన్స్ అంతకు మించి...ఛీ ఛీ ! - Telugu Bullet