జైసింహాలో ముత్తు ఛాయలు.. టెన్షన్‌లో ఫ్యాన్స్‌

jai simha inspired from Rajinikanth's Muthu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలకృష్ణ, నయనతార జంటగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైసింహా’ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. సంక్రాంతి సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. బాలయ్య డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్న ఈ చిత్రంలో నటాషా మరియు హరిప్రియ హీరోయిన్స్‌గా నటించారు. దర్శకుడు రవికుమార్‌ చౌదరి ఈ చిత్రాన్ని కాస్త ముత్తు పోలికలతో తీశాడు అంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. చిత్ర యూనిట్‌కు సంబంధించిన కొందరు ఈ విషయాన్ని లీక్‌ చేశారు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చాలా సంవత్సరాల క్రితం నటించిన ముత్తు చిత్రం తెలుగు మరియు తమిళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా స్టోరీ లైన్‌కు జైసింహా స్టోరీతో సంబంధం ఉందని అంటున్నారు.

Nandamuri Balakrishna's Jai Simha inspired from Rajinikanth's Muthu

‘ముత్తు’ చిత్రం తరహాలోనే రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నాడు. రెండు పాత్రలకు ఉండే సంబంధం కూడా ముత్తు సినిమాలో ఉన్నట్లుగా ఉంటుందని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముత్తు చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఆ స్టోరీ లైన్‌తో అయితే సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో బాలయ్య కూడా ఓకే అని ఉంటాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

jai-simha-movie

మీడియాలో వస్తున్న పుకార్లపై క్లారిటీ రావాలి అంటే చిత్ర యూనిట్‌ అయినా స్పందించాలి, లేదంటే సినిమా విడుదలైన తర్వాత అయినా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా తమిళ ఫ్లేవర్‌తో కనిపిస్తుందని కొందరు విమర్శలు చేస్తున్నారు. ‘ముత్తు’ స్టోరీ లైన్‌ అయితే సినిమాకు మరింతగా నెగటివ్‌ టాక్‌ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.