ఆదిపురుష్ కోసం టోక్యో నుంచి సింగపూర్ కి జపాన్ లేడీ ఫ్యాన్

ఆదిపురుష్ కోసం టోక్యో నుంచి సింగపూర్ కి జపాన్ లేడీ ఫ్యాన్
ఆదిపురుష్

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా సహా జపాన్ దేశంలో కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు జపాన్ లో ఫ్యాన్స్ కూడా తమ హీరో కోసం ఎంతవరకు అయినా వెళ్తారు. మరి అలా ప్రభాస్ కి జపాన్ లో ఎంతో మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉండగా లేటెస్ట్ గా ఓ లేడీ హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం చూసేందుకు ఏకంగా టోక్యో నుంచి సింగపూర్ వరకు ప్రయాణం చేసి వచ్చిందట.

దీనితో ఆమె వీడియో క్లిప్స్ ఇపుడు సోషల్ మీడియాలో తేగా వైరల్ గా మారాయి . ఆమె ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూసేందుకు వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది. దీనితో ఆమె అభిమానానికి హద్దులు లేవని అందులోని రెబల్ స్టార్ ప్రభాస్ గ్లోబల్ ఫ్యాన్స్ కి అసలే లేవని చెప్పవచ్చు . మొత్తానికి ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్ వీడియోతో ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.