మరో అరుదైన రికార్డు సాధించిన జవాన్ మూవీ..?

మరో అరుదైన రికార్డు సాధించిన జవాన్ మూవీ..?
Cinema News

నటుడు షారూఖ్ ఖాన్‌కు 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది ఆయన నటించిన రెండు చిత్రాలు లు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఏడాది ప్రారంభంలో ‘పఠాన్’ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ ను రాబట్టింది. సెప్టెంబర్‌లో విడుదలైన ‘ జవాన్‌ ’ మూవీ కూడా భారీ విజయం అందుకుంది. జవాన్ సినిమా కూడా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిపోయింది . షారుఖ్ ఖాన్ ఇప్పుడు మూవీ లు మల్టీప్లెక్స్‌లకే కాదు OTTకి కూడా తానే కింగ్ అని బాగా నిరూపించుకున్నాడు. షారుక్ నటించిన ‘జవాన్’ నెట్‌ఫ్లిక్స్ OTT లో అత్యధిక వీక్షణలను పొంది ఉన్నది .

సెప్టెంబర్ 7న ‘జవాన్’ సినిమా థియేటర్లలో విడుదలైంది. తర్వాత, షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రం నవంబర్ 2 న ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన రెండు వారాల్లోనే ఈ మూవీ రికార్డు సృష్టించింది. రెండు వారాల్లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా ‘జవాన్’ రికార్డ్ క్రియేట్ చేసుకున్నది . ఈ వార్తను నెట్‌ఫ్లిక్స్ స్వయంగా షేర్ చేసింది. షారుఖ్ ఖాన్ స్టామినాకు నిదర్శనం.

మరో అరుదైన రికార్డు సాధించిన జవాన్ మూవీ..?
Jawaan Movie

ఓటీటీలో తన సినిమాపై ఆడియన్స్ ఇంత ప్రేమను కనబరుస్తున్నందుకు షారూఖ్ సంతోషం వ్యక్తం చేశాడు. అందుకు తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదలైన ‘జవాన్’ సినిమా కి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షారూఖ్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి కూడా నటించారు.