జవాన్‌ ప్రివ్యూ

Jawaan Movie preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   సాయి ధరమ్‌ తేజ్‌, మెహ్రీన్‌ 
నిర్మాతలు:  దిల్ రాజు , కృష్ణ 
దర్శకత్వం :   BVS రవి 
సినిమాటోగ్రఫీ:   k V గుహన్ 
ఎడిటర్ : S R శేఖర్ 
మ్యూజిక్ : తమన్

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, బివిఎస్‌ఎన్‌ రవిల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు మూడు నెలల క్రితమే విడుదల అవ్వాల్సి ఉంది. కాని కొన్ని సీన్స్‌కు దిల్‌రాజు రీ షూట్‌ చెప్పడంతో ఆ సీన్స్‌ను మళ్లీ చిత్రీకరించారు. ఆ తర్వాత కొరటాల శివ కొన్ని సలహాలు సూచనలు చేశాడు. దానికి తగ్గట్లుగా మరి కొన్ని రోజుల చిత్రీకరణ చేయడం జరిగింది. ఇలా దిల్‌రాజు, కొరటాలల కారణంగా దాదాపు మూడు నాలుగు నెలల పాటు చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత కూడా రీ షూట్స్‌ పేరుతో విడుదల వాయిదాల మీద వాయిదాలు వేశారు. ఈ చిత్రంలో లక్కీ బ్యూటీ మెహ్రీన్‌ నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

మెహ్రీన్‌ హీరోయిన్‌గా ఇటీవల వరుసగా భారీ చిత్రాలు వచ్చి, విజయం సాధించాయి. ఆ కారణంగా ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో తేజూ ఏ చిత్రానికి చేయని విధంగా ఈ చిత్రానికి ఎక్కువ పబ్లిసిటీ చేశారు. టూర్‌లు, ఈవెంట్‌లు, ప్రెస్‌మీట్‌లు ఇలా అనేక రకాలుగా ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమా వర్గాల్లో మాత్రం ఎక్కడో మూల కాస్త అనుమానాలు ఉన్నాయి. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుంది అనే విషయం రేపు మీము ఇవ్వబోతున్న రివ్యూలో చూడండి.