బాలయ్యకి భయపడి తప్పుకున్న బాబు ?

Jd Chakravarthy not playing Chandrababu role in Lakshmi's NTR movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ బయోపిక్… ఇప్పుడు ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడ ఏ నలుగురు చేరినా ఇదే టాపిక్ నడుస్తోంది. ఆ చిట్ చాట్ కి అంతూపొంతూ ఉండడం లేదు. అలాంటి గాసిప్ రాయుళ్ళకి కిక్ ఇచ్చే ఇంకో హాట్ విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. రాము ఘనంగా ప్రకటించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి చంద్రబాబు పూర్తిగా తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు సీఎం చంద్రబాబుకి ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేదు నిజమే. కానీ “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ లో చంద్రబాబు పాత్రకి J.D. చక్రవర్తిని ఓకే చేసినట్టు ఇంతకుముందే తెలిసింది. ఇప్పుడు ఆ పాత్ర నుంచే కాకుండా మొత్తం ఆ ప్రాజెక్ట్ వ్యవహారాల నుంచే జేడీ తప్పుకున్నారట. అందుకు బాలయ్య బాబుకి కోపం తెప్పించడం ఎందుకని సన్నిహితులు ఇచ్చిన సూచన ప్రధాన కారణం అని తెలుస్తోంది.

ఫిలిం నగర్ లో ఇంకో టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ గురించి వర్మతో చర్చించిన బాలయ్య తర్వాత ఆ ప్రాజెక్ట్ లోకి తేజ కి ఆహ్వానం పలికారు. దీంతో కోపంగా వున్న వర్మని లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ సినిమా తీయొచ్చని ప్రేరేపించింది కూడా జేడీ అన్న మాట అక్కడక్కడా వినిపిస్తోంది. ఇక తన వద్దకు “లక్ష్మీస్ ఎన్టీఆర్ “ సినిమా గురించి వర్మ దూతగా వచ్చింది జేడీ అని లక్ష్మీపార్వతి స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. వర్మని ఎవరు అన్ని అన్నా ఎప్పుడూ ఆయన్నే నమ్ముకున్న జేడీ కూడా హ్యాండ్ ఇస్తే “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఎంతవరకు తెరకి ఎక్కుతుందో ఏమో!