రెండవ రోజు కూడా కుమ్మేసిన వీర రాఘవరెడ్డి…!

Jr NTR Aravinda Sametha Creates New Record

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం మొదటి రోజు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ టాక్‌ను దక్కించుకుని రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే నాన్‌ బాహుబలి రికార్డులను దక్కించుకున్న ఈ చిత్రం రెండవ రోజు కూడా భారీగా వసూళ్లను సాధించి దుమ్ము దులిపేసింది. దసరా సెలవులు అవ్వడంతో రెండవ రోజు కూడా భారీగా వసూళ్లు వచ్చాయి. ఇక నేడు మరియు రేపు శని, ఆదివారాలు అవ్వడంతో సినిమా మరింతగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

 

ntr-jagapatibabu

మొదటి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌ పెట్టుబడిని వెనక్కు రాబట్టడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌ వస్తున్నాయి. కనుక ఈ చిత్రం మరిన్ని రికార్డులను దక్కించుకుంటుందనే టాక్‌ వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించబోతున్న చిత్రంగా అరవింద సమేత చిత్రం నిలుస్తుందనే నమ్మకంను నందమూరి ఫ్యాన్స్‌ మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు జరుగబోతుంది.

aravindha-sametha