ఎన్టీఆర్ రెండో కొడుకు పేరు చూశారా, భలే ఉంది !

Jr NTR second son name Bhargav Ram

గత నెల 14వ తేదీన హీరో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు రెండో మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ రెండో కొడుకు నామకరణం అట్టహాసంగా జరిగింది. తన చిన్న కొడుకుకు భార్గవ రామ్ అని పేరు పెట్టినట్టు ఎన్టీఆర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాల ద్వారా ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నాడు. తన ఇంట్లో ఇది పండగ వాతావరణమని, ఆనందించే సమయమని చెప్పాడు.

తారక రాముడి పేరు కలిసి వచ్చేలా నందమూరి ఇంట్లో పుట్టిన పిల్లలకు పేరు పెట్టడం ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. అలాగే పెద్ద కుమారుడికి తాతయ్య రామారావు పేరు కలిసొచ్చేలా అభయ్ రామ్ అని పేరు పెట్టుకున్న ఎన్టీఆర్, చిన్న కుమారుడికి సైతం అదే సెంటిమెంట్ తో పేరును పెట్టాడు. తన రెండో కుమారుడికి భార్గవ రామ్ అని పేరు పెట్టాడు. భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో తాను కలిసి దిగిన క్యూట్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశాడు.