జూన్ 14 : డబుల్ ఇస్మార్ట్ రాబోతోంది……!

జూన్ 14 : డబుల్ ఇస్మార్ట్ రాబోతోంది......!
Cinema News

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అంతకుముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నారు.

జూన్ 14 : డబుల్ ఇస్మార్ట్ రాబోతోంది......!
Double Ismart

ఈ మూవీ ని మార్చ్ 8 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ మూవీ ని మేకర్స్ జూన్ 14 వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పలు కారణాల వలన మూవీ ను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ మరి అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.