ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ….జూనియర్ ఎన్టీఆర్

ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ....జూనియర్ ఎన్టీఆర్

ఎలాంటి పాత్రనైనా డైలాగ్ నైనా ఎంతో ఈజీ గా పెర్ఫామ్ చెయ్యగలిగే నటుడు తారక్. నటన మరియు అయన చూపించే ప్రేమ అభిమానం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న చలన చిత్ర పరిశ్రమ కథానాయకులలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.అలాంటి వ్యక్తి పుట్టినరోజు నేడు కావడంతో తారా స్థాయి అభిమానం చూపించి పండుగలా తారక్ అభిమానులు జరుపుతున్నారు. దీనితో ఇంత ప్రేమను చూపిస్తున్న అభిమానులకు తారక్ ధన్యవాదాలు తెలుపుతూ అయన మాటల్లో
అభిమానుల గురుంచి ఏమన్నారో చూద్దాం

“మీరు నామీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను ? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప..” అంటూ తనపై ఎంతో ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ప్రేమతో తన స్పందనను తెలిపారు. దీనితో తారక్ అభిమానులు ఈ ట్వీట్ తో మరింత ఆనందంలో మునిగి తేలుతున్నారు.