కొత్త బాటలో కాజల్ కూడా !

kajal-even-on-the-new-trail

ఈమద్య కాలంలో వెబ్‌ సిరీస్‌ లు లెక్కకు మించి నిర్మితం అవుతున్నాయి. ఒక్క సిరీస్ సక్సెస్‌ కావడం ఆలస్యం ఎంతనే వాటికి సీక్వెల్స్‌ అంటూ వరుసగా సిరీస్ లు వస్తున్నాయి. మొన్నటి వరకు ఇతర దేశాలకే పరిమితం అయిన వెబ్‌ సిరీస్‌ లు గత కొంత కాలంగా ఇండియాలో కూడా విస్తరిస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌ లను కూడా సినిమాల స్థాయిలో సినిమా నటీనటులను, టెక్నీషియన్స్ ని పెట్టి మరీ తీస్తున్నారు.

నిజానికి సినిమాలకు అయితే కొన్ని పరిమితులు, సెన్సార్‌ లాంటి కండీషన్స్‌ ఉంటాయి. వెబ్‌ సిరీస్‌ లకు అలాంటివి ఏమీ లేని కారణంగా చాలా మంది వెబ్‌ సిరీస్‌ లపై ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో సినిమాల కంటే వెబ్‌ సిరీస్‌ లకే అధిక ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు.

ఈ సిరీస్ ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితం కాగా నెమ్మదిగా తెలుగులో కూడా ఈ సిరీస్ నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే జగపతి బాబు, నవదీప, అమల, మంచు లక్ష్మి నటులతో వెబ్ సిరీస్ లు రాగా, ఇప్పుడు శ్రీ కాంత్ నటుడిగా ఒక సిరీస్ రెడీ అవుతోంది, ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ కూడా ఈ వెబ్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు హాట్‌ స్టార్‌ యాప్ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తున్నారట. ఈ సిరీస్‌ లో కాజల్‌ నటించనున్నారని అంటున్నారు. కేవలం పది ఎపిసోడ్స్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ షూటింగ్‌ను ఆగస్ట్‌లో ఆరంభించి సెప్టెంబర్‌కు ముగిస్తారని అంటున్నారు. ఒక వేళ హిట్ అయినట్టయితే ఈ సిరీస్ కి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తారని అంటున్నారు.