రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన ప్ర‌ముఖ‌ టీవీ న‌టి

kannada tv actress died in road accident

ప్రఖ్యాత టీవీ న‌టి శోభ కారు ప్ర‌మాదంలో క‌న్ను మూశారు. క‌న్న‌డ‌లో ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో ఆమె న‌టించారు. క‌ర్ణాట‌క‌లోని బ‌న‌శంక‌రి గుడికి 8 మందితో క‌లిసి కారులో వెళుతుండ‌గా, కారు టైర్ పేలి ట్ర‌క్కుని ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో శోభ‌తో పాటు ఆమె ఫ్యామిలీకి సంబంధించి అశోక్, శ్యామ‌ల‌, సుక‌న్య‌, మంజులు అక్క‌డికక్క‌డే మృత్యువాత ప‌డ్డారు. మిగ‌తా వారి ప‌రిస్థితి కూడా విష‌మంగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. మ‌గ‌లు జాన‌క్కిసీరియల్‌తో క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కి ఆమె చాలా సుప‌ర‌చితం అయింది. ఆమె రోడ్డు ప్ర‌మాదంలో క‌న్ను మూసిన విష‌యం తెలుసుకున్న సీరియ‌ల్ ద‌ర్శ‌కుడు టీఎన్ సీతారామ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. ఆమె ఆత్మ‌కి శాంతి చేకూరాని కోరారు. ప‌లువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.

ಮಗಳು ಜಾನಕಿ ಯಲ್ಲಿ ಮಂಗಳಕ್ಕನ ಪಾತ್ರ ಮಾಡುತ್ತಿದ್ದ ಶೋಭಾ, ರಸ್ತೆ ಅಪಘಾತ ದಲ್ಲಿ ನಿಧನರಾಗಿದ್ದಾರೆ ಎಂಬ ಸುದ್ದಿ ಬಂದಿದೆಸದಾ ನಗುಮುಖದ,…

Publiée par Seetharam Talagavar sur Mercredi 17 juillet 2019