కేసీఆర్ బయోపిక్ కూడా….హీరో ఎవరంటే !

kcr biopic udyama simham movie launch

ప్రస్తుతం టాలీవుడ్‌ లో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే సావ్రితి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించగా ఇటీవల మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రారంభమైంది. తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. అదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న‌పూర్ణ స్టూడియోలో కేసీఆర్ బ‌యోపిక్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సినిమాలో కేసీఆర్‌ పాత్రలో సీనియర్‌ నటుడు నాజర్‌ నటిస్తున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్‌ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.