ఆర్జీవీ వెతుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం అనే మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఈ మూవీ ను తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీ లోకి ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న కుట్రలు చూపించనున్నారు వర్మ. ఇప్పటికే ఈ సినిమా పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ గత కొద్దిరోజులుగా ఒక అమ్మాయి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గురించి ఆరా కూడా తీస్తున్నారు. ఆ అమ్మాయి ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇన్ స్ట్రా రీల్స్ ను సోషల్ మీడియా షేర్ చేసి ఆమె ఎవరో కాస్త చెప్పండి అని నెటిజన్స్ ను అడుగుతున్నారు వర్మ.

ఆర్జీవీ వెతుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
Ram Gopal Varma

నెటిజన్స్ ఊరుకుంటారా.. ఇలా వర్మ అడిగారో లేదో ఆమె ఎవరు ఆమె ఇన్ స్టా ఐడి ఏంటి అన్ని కనిపెట్టేశారు. ఆమె కేరళ బ్యూటీ అని ఆమె పేరు శ్రీలక్ష్మీ సతీష్ అని చెప్పేశారు. దాంతో ఆమె గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు మన సంచలన దర్శకుడు.

ఆ అమ్మాయి అందానికి వర్మ ముగ్ధుడు అయ్యాడు. దాంతో ఆమెను ఎలాగైనా కలవాలని.. ఆమెతో మూవీ చేయాలనీ చూస్తున్నారు. ఈ మేరకు ఆమెకు సంబంధించిన రీల్స్ ను మరోసారి షేర్ చేశారు వర్మ గారు . ఇక ఈ కేరళ కుట్టి శ్రీలక్ష్మీ సతీష్ కూడా మూవీ ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుందని అర్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగానే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. చీరకట్టులో ఈ చిన్నది చేసే రీల్స్ నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. వర్మను సైతం ఆకట్టుకుందంటే ఆమె ఎంత అందంగా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. ఆమెతో శారీ అనే సినిమా చేస్తా అంటున్నారు ఆర్జీవీ. మరి ఆ బ్యూటీ వర్మ వలకు చిక్కుతుందా..? ఒక వేళ చిక్కితే ఆమెతో ఆర్జీవీ ఎలాంటి మూవీ చేస్తాడో చూడాలి.